శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Aug 24, 2020 , 14:33:26

దక్షిణ ఫిలిప్పీన్స్‌లో జంట పేలుళ్లు.. 9 మంది దుర్మరణం

దక్షిణ ఫిలిప్పీన్స్‌లో జంట పేలుళ్లు.. 9 మంది దుర్మరణం

మనీలా : దక్షిణ ఫిలిప్పీన్స్‌ సులు ప్రావిన్స్‌లో సోమవారం జరిగిన జంట పేలుళ్లలో కనీసం 9 మంది మృతి చెందగా, 17 మంది గాయపడ్డారని సైనికాధికారులు తెలిపారు. సులు ప్రావిన్స్ రాజధాని జోలోలోని అత్యంత రద్దీగా ఉన్న ఓ వీధిలో కిరాణా దుకాణం ఎదుట నిలిపిన మిలటరీ ట్రక్‌ లక్ష్యంగా మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన తొలి పేలుడులో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గంట తరువాత మొదటి పేలుడు ప్రదేశానికి 70 మీటర్ల దూరంలోని క్యాథలిక్‌ చర్చిలో రెండో పేలుడు జరగ్గా నలుగురు మృతి చెందారు. రెండుచోట్ల గాయపడిన 17 మందిని అధికారులు చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. పేలుళ్లకు తామే బాధ్యత వహిస్తున్నట్లు ఇంతవరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo