బుధవారం 03 జూన్ 2020
International - Apr 27, 2020 , 17:25:44

ర‌ష్యా సైన్యంలో 874 మందికి క‌రోనా

ర‌ష్యా సైన్యంలో 874 మందికి క‌రోనా

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి మార్చి నెల‌లో ర‌ష్యాలో కాలుమోపింది మొద‌లు ఇప్ప‌టివ‌ర‌కు 874 మంది ఆ వైర‌స్ బారిన‌ప‌డ్డార‌ని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అందులో 379 మంది ఇండ్ల‌ వద్దే సెల్ఫ్‌ ఐసోలేష‌న్‌లో ఉన్నార‌ని తెలిపింది. మిగిలిన వారికి వివిధ ఆస్పత్రుల్లోని ఐసోలేష‌న్ కేంద్రాల్లో చికిత్స జరుగుతోందని వెల్లడించింది. వారిలో నలుగురు జవాన్ల పరిస్థితి కొంచెం తీవ్రంగా ఉండగా, ఒకరు వెంటిలేటర్‌పై ఉన్నారని పేర్కొన్న‌ది. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo