ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 21, 2020 , 15:03:51

ఆప్ఘనిస్తాన్‌లో ఆత్మహుతి దాడి.. 8 మంది సైనికులు మృతి

ఆప్ఘనిస్తాన్‌లో ఆత్మహుతి దాడి.. 8 మంది సైనికులు మృతి

కాబూల్‌ : ఆప్ఘనిస్థాన్‌ సెంట్రల్‌ ప్రావిన్స్‌ మైదాన్‌ వార్దాక్‌లో సోమవారం మధ్యాహ్నం తాలిబన్లు జరిపిన కారుబాంబు ఆత్మహుతి దాడిలో 8 మంది ఆప్ఘన్‌ జాతీయ ఆర్మీ సైనికులు మృతి చెందగా మరో తొమ్మిది మంది గాయపడినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ మంగళవారం ధ్రువీకరించింది. కాబూల్‌కు పశ్చిమ దిశలోని సయీద్ అబాద్ జిల్లాలో సైనికుల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగినట్లు సైనికాధికారులు తెలిపారు. దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. పౌరులపై ఆఫ్ఘన్ సైనికులు జరుపుతున్న వైమానిక దాడులకు ప్రతీకారంగానే దాడికి
పాల్పడినట్లు వారు తెలిపారు. అంతర్-ఆఫ్ఘన్ చర్చలను ప్రారంభించేలా ఖైదీల మార్పిడికి అష్రఫ్ ఘని ప్రభుత్వం తాలిబన్లతో శాంతిచర్చలు జరుగుపుతున్నతరుణంలో ఈ దాడి జరిగింది.


logo