శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Aug 08, 2020 , 18:43:10

సోమాలియాలో ఆత్మాహుతి దాడి.. 8 మంది మృతి

సోమాలియాలో ఆత్మాహుతి దాడి.. 8 మంది మృతి

మొగాడిషు : సోమాలియన్ రాజధాని మొగాడిషులోని సైనిక స్థావరం సమీపంలో శనివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 8 మంది మృతి చెందగా మరో 14 మంది గాయపడ్డారు. శుక్రవారం వార్తా-నబడ్డా జిల్లాలోని 12 ఏప్రిల్ ఆర్మీ బ్రిగేడ్ స్థావరం ప్రవేశద్వారం వద్ద ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఇంకా ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు. దేశంలో నిత్యం ఏదో ఓ చోట్ల ఆత్మాహుతి దాడులు జరుగుతుండడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. దాడి నేపథ్యంలో మొగాడిషులో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.


logo