మంగళవారం 07 జూలై 2020
International - May 31, 2020 , 17:39:05

బాంబు పేలి 8 మంది మృతి..

బాంబు పేలి 8 మంది మృతి..

నైరోబి: సోమాలియా రాజధాని నైరోబీలో బాంబు పేలుడు సంభవించింది. ఆదివారం ఉదయం మొగదిషుకు సమీపంలోని హవా అబ్ది ప్రాంతం మీదుగా మినీ బస్సు వెళ్తుండగా..రోడ్డు పక్కనే ఉన్న బాంబు పేలింది. పేలుడుతో బస్సులో వెళ్తున్న వారిలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయాలైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించామని ఉన్నతాధికారి అబ్దుల్లాహి అహ్మద్ తెలిపారు. బాంబు దాడికి ఎవరు పాల్పడ్డారనే దానిపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo