శనివారం 23 జనవరి 2021
International - Dec 24, 2020 , 07:41:36

పాక్‌లో దుర్ఘటన.. బాయిలర్‌ పేలి 8 మంది మృతి

పాక్‌లో దుర్ఘటన.. బాయిలర్‌ పేలి 8 మంది మృతి

కరాచీ : పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న ఓ ఐస్‌ ఫ్యాక్టరీలో మంగళవారం రాత్రి పేలుడు సంభవించి ఎనిమిది మంది మరణించారు. 30 మంది గాయపడ్డారు. పోలీసులు మాట్లాడుతూ ఫ్యాక్టరీలోని బాయిలర్‌ పేలడంతోనే ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాద ధాటికి ఫ్యాక్టరీ పరిసరాల్లోని మరో మూడు పరిశ్రమలు కూడా దెబ్బతిన్నాయన్నారు. శిథిలాల నుంచి 8 మృతదేహాలను వెలికితీశామని, గాయపడిన వారిని దవాఖానకు తరలించామని పేర్కొన్నారు.logo