బుధవారం 03 జూన్ 2020
International - Apr 27, 2020 , 10:03:57

చైనాలో 8.9 కోట్ల నాణ్యత లేని మాస్క్‌లు జప్తు

చైనాలో 8.9 కోట్ల నాణ్యత లేని మాస్క్‌లు జప్తు

బీజింగ్‌: నాణ్యత లేని 8.9 కోట్ల ఫేస్‌మాస్క్‌లను జప్తు చేసినట్లు చైనా అధికారులు ఆదివారం తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్న మాస్క్‌ల నాణ్యతపై పలు దేశాలు ఫిర్యాదు చేశాయి. దీంతో చైనా మార్కెట్‌ నియంత్రణాధికారులు 1.6 కోట్ల వ్యాపార సంస్థలపై శుక్రవారం దాడులు చేసి 8.9 కోట్ల మాస్క్‌లను, 4.18 లక్షల రక్షణ పరికరాలను జప్తు చేశారు. వీటి విలువ 11 లక్షల అమెరికన్‌ డాలర్లు ఉంటుందని చైనా అధికారులు చెప్పారు. 


logo