గురువారం 16 జూలై 2020
International - May 28, 2020 , 22:25:04

పేదరికంలోకి కొత్తగా 8.6 కోట్ల చిన్నారులు

పేదరికంలోకి కొత్తగా 8.6 కోట్ల చిన్నారులు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి  చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ కారణంగా అన్నిరంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పుడిప్పుడే కొన్ని నిబంధనలకు లోబడి వ్యాపార సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు తమ రోజూవారీ  కార్యక్రమాలను ప్రారంభించాయి. అయితే, లాక్‌డౌన్‌తో తలెత్తిన సామాజిక, ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 8.6 కోట్ల మంది చిన్నారులు పేదరికంలోకి జారిపోయే ప్రమాదం ఉన్నదని యూనిసెఫ్‌, సేవ్‌ ద చిల్డ్రన్‌ స్వచ్ఛంద సంస్థ సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది.

2020 చివరికల్లా పేద కుటుంబాల్లో నివసించే పిల్లల సంఖ్య 15 శాతం పెరిగి 67.2 కోట్లకు చేరుకోనున్నదని నివేదిక పేర్కొన్నది. లాక్‌డౌన్‌తో అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో పేదరికం ఆందోళనకర స్థాయిలో పెరుగనున్నదని, ప్రభుత్వాలు వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని సూచించింది. లాక్‌డౌన్‌ ప్రభావం యూరప్‌, మధ్య ఆసియా దేశాల్లో ఎక్కువగా ఉన్నదని యూనిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హెన్రీయెట్టా ఫోర్‌ చెప్పారు. చిన్నారుల్లో పోషకాహాకార లోపం, ఆకలి ప్రభావం జీవితాంతం ఉంటుందని సేవ్‌ ద చిల్డ్రన్‌ ఇంటర్‌నేషనల్‌ సీఈవో ఇంగల్‌ అషింగ్‌ అందోళన వ్యక్తంచేశారు.


logo