సోమవారం 01 జూన్ 2020
International - Apr 27, 2020 , 15:33:31

సింగపూర్‌లో కరోనా బాధితుల్లో విదేశీ కార్మికులే ఎక్కువ

సింగపూర్‌లో కరోనా బాధితుల్లో  విదేశీ కార్మికులే ఎక్కువ

సింగపూర్‌: సింగపూర్‌లో వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. తాజాగా ఆ దేశంలో  కొత్తగా 799 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని సింగపూర్‌ ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు వైరస్‌ సోకిన వారి సంఖ్య 14,423కు చేరింది. కొత్తగా వైరస్‌ నిర్ధారణ అయిన  వారిలో కేవలం 14 మంది మాత్రమే సింగపూర్‌ దేశీయులు కావడం గమనార్హం. సింగపూర్‌లో అత్యధిక శాతం మంది కరోనా బాధితులు విదేశీ కార్మికులేనని ఆదేశ అధికారులు తెలిపారు. వీరంతా భారత్‌తో పాటు పలు దేశాల నుంచి వలస వచ్చారు. వలస కార్మికులంతా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డార్మిటరీల్లో నివసిస్తున్నారు. 


logo