బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Feb 20, 2020 , 14:53:58

దొంగపై వృద్దుడి పంచ్‌లు..వీడియో చూడాల్సిందే

దొంగపై  వృద్దుడి పంచ్‌లు..వీడియో చూడాల్సిందే

సౌత్‌ వేల్స్‌:ఏడు పదుల వయస్సులోనూ ఓ పెద్దాయన ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. యూకేలో 77 ఏళ్ల వృద్దుడు కారులో కార్డిఫ్‌ వద్దున్న ఏటీఎం దగ్గరకు డబ్బులు డ్రా చేసుకునేందుకు వచ్చాడు. అతడు నగదు డ్రా చేసుకుని వస్తుండగా..ఇంతలో ముసుగు వేసుకున్న వ్యక్తి ఒకరు ముసలాయన దగ్గరున్న డబ్బు, ఏటీఎం కార్డులివ్వాలని బెదిరించాడు. ఆ ముసలాయన మాత్రం ఏం భయపడకుండా రెండు చేతుల పిడికిళ్లు బిగించి..దొంగపై పంచ్‌లు విసిరాడు. పెద్దాయన పంచ్‌లకు దొంగ బెదిరిపోయాడు. ఈ ఘటనంతా అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది. సౌత్‌ వేల్స్‌ పోలీసులు పెద్దాయన ధైర్యసాహసాలపై ప్రశంసలు కురిపిస్తూ..ఈ వీడియోను  ఫేస్‌బుక్‌ ద్వారా షేర్‌ చేశారు. ఈ వీడియో వైరల్‌ అవుతోంది. 


logo