ఆదివారం 24 మే 2020
International - Feb 20, 2020 , 12:54:36

వృద్ధుడి పంచ్‌లకు దొంగ పరారీ.. వీడియో

వృద్ధుడి పంచ్‌లకు దొంగ పరారీ.. వీడియో

ఓ 77 ఏళ్ల వృద్ధుడు తన బాక్సింగ్‌ పంచ్‌లతో దొంగకు చుక్కలు చూపించాడు. నగదు దోచుకునేందుకు వచ్చిన ఆ దొంగ.. వృద్ధుడి పంచ్‌లకు భయపడి క్షణాల్లో పారిపోయాడు. ఈ ఘటన సౌత్‌ వేల్స్‌లోని కోల్చేస్టర్‌ అవెన్యూలో చోటు చేసుకుంది. ట్రివోర్‌ వెస్టన్‌(77) నగదు డ్రా చేసుకునేందుకు ఏటీఎం వద్దకు వెళ్లాడు. నగదు డ్రా చేసుకుని తిరిగి తన కారు వద్దకు వెస్టన్‌ వస్తున్న సమయంలో ఓ దొంగ ఆ వృద్ధుడిని అడ్డుకున్నాడు. వృద్ధుడిని వ్యాలెట్‌ ఇవ్వాలని దొంగ డిమాండ్‌ చేశాడు. దొంగకు ఏం బెదరకుండా.. వెస్టన్‌ తన పంచ్‌లతో అతడిని బెదిరించాడు. వృద్ధుడి బాక్సింగ్‌ పంచ్‌లకు భయపడ్డ దొంగ అక్కడ్నుంచి పారిపోయాడు. ఈ వీడియోను సౌత్‌ వేల్స్‌ పోలీసులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. వృద్ధుడి ధైర్యంపై పోలీసులు, నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. 


logo