సోమవారం 25 మే 2020
International - Mar 30, 2020 , 11:52:45

ఇట‌లీలో ఒకేరోజు 756 క‌రోనా మ‌ర‌ణాలు

ఇట‌లీలో ఒకేరోజు 756 క‌రోనా మ‌ర‌ణాలు

న్యూఢిల్లీ: ప‌్రాణాంత‌క క‌రోనా మ‌హ‌మ్మారి ఇట‌లీని ముప్పుతిప్ప‌లు పెడుతున్న‌ది. ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌కంటే ఇట‌లీలోనే ఎక్కువ‌గా క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఆ దేశంలో 756 మంది క‌రోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇట‌లీలో క‌రోనా బారిన‌ప‌డి మ‌ర‌ణించిన వారి సంఖ్య 10,779కి చేరింది. ఇట‌లీ పౌర ర‌క్ష‌ణ విభాగం అధిప‌తి ఆంగెలో బొరెల్లీ ఆదివారం ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. 

ఇదిలావుంటే, క‌రోనా మ‌ర‌ణాలే కాదు కేసుల సంఖ్య కూడా ఇట‌లీలో శ‌ర‌వేగంగా పెరుగుతున్న‌ది. ఆదివారం ఒక్క‌రోజే అక్క‌డ‌ కొత్త‌గా 3,815 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆ దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 73,880కి చేరింది. వారిలో 1,434 మంది వైర‌స్ బారినుంచి పూర్తిగా కోలుకున్నారు. పాల‌కులు, అధికారులు ఎన్ని జాగ్ర‌త్తలు తీసుకున్నా కేసుల సంఖ్య‌గానీ, మ‌ర‌ణాల సంఖ్య‌గానీ త‌గ్గ‌క‌పోవ‌డం ఇట‌లీ వాసుల‌ను తీవ్ర ఆందోళ‌న‌కు గురిచేస్తున్న‌ది.  


logo