శనివారం 30 మే 2020
International - May 18, 2020 , 15:12:08

డ‌బ్ల్యూహెచ్‌వో వ‌ర్చువ‌ల్ భేటీ.. మాట్లాడ‌నున్న జిన్‌పింగ్‌

డ‌బ్ల్యూహెచ్‌వో వ‌ర్చువ‌ల్ భేటీ..  మాట్లాడ‌నున్న జిన్‌పింగ్‌


హైద‌రాబాద్‌: ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తొలిసారి వ‌ర్చువ‌ల్ స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. 73వ వార్షిక స‌మావేశాలు ఇవాళ ప్రారంభంకానున్నాయి. చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్‌.. ఈ స‌మావేశాల్లో ప్ర‌సంగం చేయ‌నున్నారు.  డ‌బ్ల్యూహెచ్‌వో ఆహ్వానం మేర‌కు జిన్‌పింగ్ మాట్లాడ‌నున్న‌ట్లు చైనా పేర్కొన్న‌ది. క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌బ‌లిన నేప‌థ్యంలో వ‌ర్చువ‌ల్ స‌మావేశాలు కీల‌కంగా మారాయి. అమెరికాతో స‌హా ప‌లు దేశాలు.. వైర‌స్ విష‌యంలో చైనా తీరును త‌ప్పుప‌డుతున్నాయి.  వైర‌స్ విష‌యాన్ని డ‌బ్ల్యూహెచ్‌వో దాచిపెట్టింద‌ని కూడా ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  ప‌లు ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో డ‌బ్ల్యూహెచ్‌వో భేటీ మ‌రింత ఉద్విగ్నం మార‌నున్న‌ది.  logo