e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home News 72 ఏళ్ల వృద్ధుడికి ప‌ది నెల‌ల్లో 43 సార్లు క‌రోనా పాజిటివ్‌

72 ఏళ్ల వృద్ధుడికి ప‌ది నెల‌ల్లో 43 సార్లు క‌రోనా పాజిటివ్‌

అత‌డు క‌రోనాను జ‌యించాడు ! అది కూడా ఏడు ప‌దుల వ‌య‌సులో !! అందులో వింత ఏముంది.. సెంచ‌రీకి చేరువైన వాళ్లు కూడా క‌రోనాను జ‌యించారు క‌దా అని అనుకుంటున్నారా ! కానీ అది నిజంగా అద్భుత‌మే !! ఎందుకు అంటారా.. సాధార‌ణంగా క‌రోనా వైర‌స్ సోకిన త‌ర్వాత‌ రెండు నుంచి మూడు వారాల్లోనే కోలుకుంటారు. నెల‌లోపే నెగెటివ్ వ‌స్తుంది. కానీ ఈ తాత‌కి వైర‌స్ సోకి ప‌ది నెల‌లు దాటిపోయింది. ఈ 10 నెల‌ల్లో ఎన్నోసార్లు కోలుకున్న‌ట్టే కోలుకున్నాడు.. అంత‌లోనే సీరియ‌స్ అయ్యాడు. అలా ప‌ది నెల‌ల్లో 43 సార్లు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఏడు సార్లు అయితే ఇక బ‌త‌క‌డని ఆశ‌లు వ‌దులుకుని అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాట్లు కూడా చేశారంట కుటుంబ స‌భ్యులు. కానీ ఆశ్చ‌ర్యంగా క‌రోనా వైర‌స్‌తో 10 నెల‌ల సుదీర్ఘ పోరాటం త‌ర్వాత ఇప్పుడు కోలుకున్నాడు.

అత‌ని పేరు డేవ్ స్మిత్‌. వ‌య‌సు 72 ఏళ్లు. బ్రిస్టల్‌లో డ్రైవింగ్ ఇన్‌స్ట్ర‌క్ష‌ర్‌గా ప‌నిచేసి రిటైర్ అయ్యాడు. గ‌త ఏడాది మేలో డేవ్ స్మిత్‌కు తొలిసారి క‌రోనా వైర‌స్ సోకింది. అప్ప‌టికే స్మిత్‌కు హైప‌ర్ సెన్సిటివిటీ నిమోనైటిస్ అనే ఊపిరితిత్తుల స‌మ‌స్య ఉంది. దీనికితోడు లింఫోసైటిక్ లుకేమియా అనే క్యాన్స‌ర్‌తోనూ ఆయ‌న బాధ‌ప‌డుతున్నాడు. దీనివ‌ల్ల ఇమ్యూనిటీ త‌క్కువ ఉండ‌టంతో ఆస్ప‌త్రిలో చేర్చారు. అక్క‌డ యాంటీబయాటిక్స్ ఇచ్చిన వైద్యులు.. డేవ్ కోలుకోవ‌డంతో ఇంటికి పంపించేశారు. కానీ జూలైలో మ‌రోసారి డేవ్‌స్మిత్ ఆరోగ్యం విష‌మించింది. ఆస్ప‌త్రికి తీసుకెళ్లి ప‌రీక్ష‌లు చేయ‌గా మ‌ళ్లీ క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.

- Advertisement -

తొలుత డేవ్ స్మిత్‌కు వైర‌స్ మ‌ళ్లీ సోకింద‌ని అనుకున్నారు.. కానీ వైర‌స్ జ‌న్యు క్ర‌మాన్ని ప‌రిశీలించిన వైద్యులు షాక‌య్యారు. ఎందుకంటే ఆయ‌న‌కు కొత్త‌గా వైర‌స్ సోక‌లేదు.. మున‌ప‌టి ఇన్‌ఫెక్ష‌నే ఇంకా త‌గ్గ‌లేద‌ని వాళ్లు గుర్తించారు. ఆ త‌ర్వాత ఎంత‌కీ ఆయ‌న‌కు క‌రోనా త‌గ్గ‌లేదు. దీంతో రెమిడిసివ‌ర్ ఇంజెక్ష‌న్ కూడా ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ వైర‌స్ లోడ్‌ త‌గ్గ‌లేదు. అప్ప‌టికే క‌రోనా సోకి 265 రోజులు కావ‌డంతో చివ‌రి ప్ర‌య‌త్నంగా యాంటీబాడీ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. నిజానికి బ్రిట‌న్‌లో ఈ చికిత్స‌ అనుమ‌తి పొంద‌లేదు. కానీ ఏ చికిత్స‌కు క‌రోనా త‌గ్గ‌క‌పోవ‌డంతో మాన‌వతా దృక్ప‌థంతో ఆయ‌న‌కు ఈ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. యాంటీబాడీలు పొందిన 45 రోజుల త‌ర్వాత ఆయ‌న‌కు ఆర్టీ పీసీఆర్ ప‌రీక్ష చేస్తే నెగెటివ్ వ‌చ్చింది. . ప్ర‌స్తుతం హాస్పిట‌ల్‌నుంచి డిశ్చార్జి అయిన డేవ్‌స్మిత్‌.. ఇది త‌న లైఫ్‌కు బోన‌స్ అని చెప్పుకుంటున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

క‌రోనా మృతుల అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లొచ్చా ? మ‌ర‌ణించిన వ్య‌క్తి శ‌రీరంలో వైర‌స్ ఎంత‌సేపు బ‌తికి ఉంటుంది?

monoclonal antibody treatment : ఒక్క‌రోజులోనే క‌రోనా ల‌క్ష‌ణాలు ఖ‌తం? అస‌లేంటి ఆ ట్రీట్‌మెంట్ ? ఎవ‌రికి అవ‌స‌రం ?

coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి

Coronavirus Recovery: క‌రోనా త‌గ్గినా నీర‌సంగా ఉంటుందా? ఈ జాగ్ర‌త్త‌లు అవ‌స‌ర‌మే

Post Corona symptoms : క‌రోనా త‌గ్గాక జుట్టు రాలుతుందా? ఇలా ట్రై చేయండి

72 ఏళ్ల వృద్ధుడికి ప‌ది నెల‌ల్లో 43 సార్లు క‌రోనా పాజిటివ్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana