శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Aug 01, 2020 , 08:39:18

అల‌స్కాలో రెండు విమానాలు ఢీ... ఏడుగురు మృతి

అల‌స్కాలో రెండు విమానాలు ఢీ... ఏడుగురు మృతి

వాషింగ్ట‌న్‌: అల‌స్కాలో రెండు విమానాలు ఢీకొడ‌నంతో ఏడుగురు మ‌ర‌ణించారు. మృతుల్లో అల‌స్కా రాష్ట్ర శాస‌న‌స‌భ్యుడు గ్యారీ నాప్ కూడా ఉన్నారు. సొల్డోట్నా విమానాశ్ర‌యానికి రెండు మైళ్ల దూరంలో శుక్ర‌వారం ఉద‌యం సుమారు 8.30 గంట‌ల ప్రాంతంలో రెండు విమానాలు ఢీకొన్నాయ‌ని స్థానిక ప‌బ్లిక్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. 


రెండు తేలికపాటి విమానాల్లో ఒక‌టి సింగిల్ ఇంజ‌న్ క‌లిగిన హావిల్లాండ్ డీహెచ్‌సీ-2 బీవ‌ర్ విమాన‌మి, మ‌రొక‌టి పైప‌ర్-పీఏ 12 విమాన‌మ‌ని తెలిపారు. ఒకే ఇంజిన్ క‌లిగిన విమానంలో ఒక్క‌రే ఉండ‌గా, మ‌రో విమానంలో ఏడుగురు ప్ర‌యాణిస్తున్నార‌ని వెల్ల‌డించారు. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు మ‌ర‌ణించ‌గా, ఒక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని, అత‌న్ని స్థానిక ద‌వాఖాన‌కు త‌ర‌లించామ‌ని వెల్ల‌డించారు. గ్యారీ నాప్ స్వ‌యంగా విమానం న‌డుపుతున్నార‌ని తెలిపారు. 


logo