మంగళవారం 02 మార్చి 2021
International - Jan 21, 2021 , 23:21:23

ఫిలిప్పీన్స్‌లో భూకంపం:రిక్ట‌ర్ స్కేల్‌పై 7.0గా న‌మోదు

ఫిలిప్పీన్స్‌లో భూకంపం:రిక్ట‌ర్ స్కేల్‌పై 7.0గా న‌మోదు

మ‌నీలా: ‌ఫిలిప్పైన్స్ లోని ద‌క్షిణ ప్రాంతంలో గురువారం రాత్రి శ‌క్తిమంత‌మైన భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై దాని తీవ్ర‌త 7.0గా రికార్డ‌యింది. ఎటువంటి ఆస్తిన‌ష్టం జ‌రుగ‌లేద‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి. అమెరికా జియ‌లాజిక‌ల్ స‌ర్వే క‌థ‌నం ప్ర‌కారం మిండానావో దీవిలోని ఆగ్నేయ న‌గ‌రం ద‌వావో సిటీకి 310 కి.మీ. దూరంలో 95 కి.మీ లోతున భూకంప కేంద్రం కేంద్రీక్రుత‌మైంది.

స్థానిక కాల‌మానం ప్ర‌కారం రాత్రి 8.23 గంట‌ల‌కు భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. దీని ప్ర‌భావంతో జోస్ అబాద్ శాంతోస్ సిటీలో 15 నిమిషాల సేపు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. స్థానికులు భ‌యంతో ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశార‌ని స్థానిక పోలీస్ చీఫ్ కెప్టెన్ గ్లాబ్య్నారీ మురిల్లో చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo