మంగళవారం 20 అక్టోబర్ 2020
International - Oct 13, 2020 , 11:21:06

నిటారుగా ఉన్న కోట ఎక్కి ప్ర‌సంశ‌లు పొందిన బామ్మ‌ : వీడియో వైర‌ల్‌

నిటారుగా ఉన్న కోట ఎక్కి ప్ర‌సంశ‌లు పొందిన బామ్మ‌ :  వీడియో వైర‌ల్‌

వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్ర‌మే అని ఇప్ప‌టికే చాలాసార్లు రుజువైంది. అది నిజ‌మే అని మ‌రోసారి రుజువు చేసింది 68 ఏండ్ల బామ్మ‌. మ‌హారాష్ట్ర‌, నాసిక్‌లోని ఏట‌వాలుగా ఉన్న హరిహర్ కోటను చ‌క‌చ‌కా ఎక్కేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. దీనిని ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుధా రామెన్ త‌న ట్విట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

వీడియోలో బామ్మ‌తో పాటు వెనుక‌వైపు ఒక వ్య‌క్తి న‌డుస్తున్నాడు. ట్రెక్ పైన నిల‌బ‌డి ఉన్న ప్ర‌జ‌లు ఆమెను ప్రోత్స‌హిస్తున్నారు. తెల్ల‌ని చీర ధ‌రించిన ఆశా అంబాడే మెట్లు ఎక్కేట‌ప్పుడు ఇరువైపులా ఉన్న అంచుల‌ను ప‌ట్టుకొని న‌డిచింది. ట్రెక్ పూర్తి చేసిన త‌ర్వాత ఈల‌లు, చీర్స్‌, చ‌ప్ప‌ట్ల‌తో ఆమె పైకి చేరుకుంది. నాసిక్ నుంచి 40 కి.మీ. దూరంలో ఈ కోట ఉంది. హరిహర్ కోట దాదాపు 80-డిగ్రీల వంపులో చెక్కబడింది.  


logo