గురువారం 28 మే 2020
International - Apr 23, 2020 , 16:38:56

68 ఏండ్ల వ‌య‌సులో క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన మ‌హిళ‌!

68 ఏండ్ల వ‌య‌సులో క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన మ‌హిళ‌!

నైజీరియాకు చెందిన మార్గెరెట్ అడెనుగా, నోహ్ అడెనుగా దంప‌తుల‌కు అమ్మాయి, అబ్బాయి ఇద్ద‌రు క‌వ‌ల‌లు పుట్టారు. ఆశ్చ‌ర్యం ఏమిటంటే.. 68 ఏండ్ల వ‌స‌యులో వీరికి జ‌న్మ‌నివ్వ‌డం విశేషం. అది కూడా మూడు సార్లు చేసిన చికిత్స‌లో విఫ‌ల‌మవగా, నాలుగోసారి చేసిన ఐవిఎప్ విధానంతో విజ‌యం సాధించింది. ఏప్రిల్ 14న లాగోస్లోనిలోని ఒక హాస్పిట‌ల్‌లో సిజేరియ‌న్ చేసి పిల్ల‌ల‌ను బ‌య‌ట‌కు తీశారు. త‌ల్లి బిడ్డ‌లు ముగ్గూరూ క్షేమంగా ఉన్నారు. 

పోయిన ఏడాది ఐవిఎఫ్ ద్వారా గ‌ర్భ‌వ‌తి అయిన‌ట్లు 70 ఏండ్ల భ‌ర్త నోహ్ అడెనుగా వెల్ల‌డించారు. ఎన్నిసార్లు విఫ‌ల‌మైనా పిల్ల‌లు కావాల‌న్న ఆశ మాత్రం వ‌దులుకోలేద‌ని చెబుతున్నారు. అది ఇప్పుడు నిజ‌మైంది. లాగోస్ యూనివ‌ర్శిటీ టీచింగ్ హాస్పిట‌ల్‌లో 37 వారాల‌కు సిజేరియ‌న్  ద్వారా కవలలు జ‌న్మించారు. ఆమె వ‌య‌సు కార‌ణంగా గ‌ర్భం ప‌ర్య‌వేక్షించ‌డానికి హాస్పిట‌ల్‌లో ఒక ప్ర‌త్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.logo