బుధవారం 25 నవంబర్ 2020
International - Oct 28, 2020 , 02:23:57

రెండు రాష్ర్టాలు దాటుకొని.

రెండు రాష్ర్టాలు దాటుకొని.

అత్యంత నెమ్మదిగా ప్రయాణించే జీవుల్లో తాబేలు ఒకటి. అయితే అమెరికాలోని అలబామా రా్రష్ట్రంలోని ఓ శాంక్చరీ నుంచి తప్పించుకున్న ఓ తాబేలు ఏకంగా రెండు రాష్ర్టాలతో పాటు 200 ఎకరాల సోయాబీన్‌ వ్యవసాయ క్షేత్రాన్ని దాటుకొని తిరిగి ఎట్టకేలకు సొంతగూటికి చేరుకున్నది. వివరాల్లోకెళ్తే.. ఆఫ్రికన్‌ జాతికి చెందిన ‘స్పార్క్‌ప్లగ్‌' పేరుగల ఓ 200 పౌండ్ల (90 కిలోలు) బరువున్న తాబేలును హ్యారిస్‌ అనే వ్యక్తి శాంక్చరీలో పెంచుతున్నాడు. ఇటీవల శాంక్చరీ చుట్టున్న కంచెను దాటుకొని ఆ తాబేలు బయటకు వెళ్లిపోయింది. రెండు రాష్ర్టాలు, 200 ఎకరాల సోయాబీన్‌ వ్యవసాయ క్షేత్రాన్ని తిరిగిన ఆతాబేలు చివరికి ఓవ్యక్తి కంట పడటం.. ఈ విషయం అధికారులకు తెలువంతో ఎట్టకేలకు శాంక్చరీకి తిరిగి చేరింది.