సోమవారం 01 జూన్ 2020
International - Apr 01, 2020 , 09:00:27

ముద్ర‌ణ‌ ఆపేసిన 60 దిన‌ప‌త్రిక‌లు

ముద్ర‌ణ‌ ఆపేసిన 60 దిన‌ప‌త్రిక‌లు

హైద‌రాద్‌: ఆస్ట్రేలియాలో సుమారు 60 ప్రాంతీయ దిన‌ప‌త్రిక‌లు ముద్ర‌ణ‌ను నిలిపివేశాయి.  వైర‌స్ వ‌ల్ల ప్రింట్ ఎడిష‌న్‌ను ఆపివేస్తున్న‌ట్లు ఆ న్యూస్‌పేప‌ర్లు వెల్ల‌డించాయి.  మీడియా గ్రూపు న్యూస్ కార్ప్ ఈ విష‌యాన్ని తెలియ‌జేసింది. అయితే ఆన్‌లైన్‌లో మాత్రం త‌మ వార్త‌లు ఉంటాయ‌ని ఆ ప‌త్రిక‌లు పేర్కొన్నాయి. ఇదేమీ చిన్న నిర్ణ‌యం కాదు అని, ఇప్ప‌టికే ప్రింట్ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటోంద‌ని, ఇక అడ్వ‌ర్ట‌యిజింగ్ కూడా ప‌డిపోవ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకోక త‌ప్ప‌లేద‌ని ఆస్ట్రేలియా న్యూస్ కార్ప్ చీఫ్ మైఖేల్ మిల్ల‌ర్ తెలిపారు. 


logo