మంగళవారం 26 మే 2020
International - May 23, 2020 , 12:26:16

పోలీసులు వదిలేసిన కేసును సాల్వ్‌ చేసిన బుడ్డోడు!

పోలీసులు వదిలేసిన కేసును సాల్వ్‌ చేసిన బుడ్డోడు!

లాక్‌డౌన్‌లో ఆడి ఆడి బోర్‌గా ఫీలైన ఆరేండ్ల బుడతడు నాక్స్‌ బ్రూవర్‌ మాగ్నెట్‌ ఫిషింగ్‌ ప్రారంభించాడు. అయస్కాంతంతో సరస్సునంతా గాలిస్తుండగా లంక బిందే దొరికింది. దీనిని ఆశించకుండా పోలీసులకు ఫిర్యాదు చేశాడు నాక్స్‌ తండ్రి.

కొన్నేండ్ల కిందట సౌత్‌ కరోలినాలోని ఒక సరస్సుకు దగ్గరలో ఉన్న వీధిలో ఒక మహిళ నివసిస్తున్నది. ఆమె ఇంట్లో దొంగతనం జరిగింది. బంగారం, నగలు, డబ్బు అలాగే క్రెడిట్‌, డెబిట్ కార్డులను కూడా దొంగ అపహరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోయింది. వీటన్నింటినీ నాక్స్‌ సరస్సులో కనుగొన్నాడు.  విషయం తెలుసుకున్న  అధికారులు వస్తువులన్నింటినీ పరిశీలించారు. వస్తువలకు యజమాని ఎవరో తెలుసుకున్నారు. ఆమెను పిలిచి ఆభరణాలు, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను అప్పగించారు. ఈ నగలపై ఆశలు వదులుకున్న మహిళ నాక్స్‌ను హత్తుకొని కృతజ్ఞతలు తెలిపింది. అలాగే పోలీసులు కూడా ఈ బుడ్డోడిని అభినందించారు.


logo