శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Jul 15, 2020 , 14:52:05

చిట్టి చెల్లిని ర‌క్షించిన బుల్లి అన్న‌య్య‌! స‌లాం కొట్టిన హీరో

చిట్టి చెల్లిని ర‌క్షించిన బుల్లి అన్న‌య్య‌! స‌లాం కొట్టిన హీరో

అన్న‌య్య బాధ్య‌త‌లు స్వీక‌రించాలంటే త‌గిన వ‌య‌సు రాన‌వ‌స‌రం లేదు. అది పుట్టుక‌పోతేనే వ‌స్తుంది. చెల్లికి ఆప‌ద వ‌చ్చిందంటే చాలు ఎన్ని అడ్డంకులు ఉన్న‌ప్ప‌టికీ వెంట‌నే వ‌చ్చి వాలిపోతాడు‌. నాన్న త‌ర్వాత నాన్న‌లాంటివాడు అన్న‌య్యే . అందుకే ప్ర‌తి చెల్లికి ఒక అన్న‌య్య ఉండాలి అని అంటారు. త‌న చిట్టి చెల్లిని ర‌క్షించ‌డానికి 6 ఏండ్ల వ‌య‌సులోనే సాహ‌సానికి పాల్ప‌డ్డాడు ఓ అన్న‌య్య‌. అందుకు ఫ‌లితంగా పెద్ద మొత్తంలోనే కుట్లు కూడా ప‌డ్డాయి.

యుస్‌లోని వ్యోమింగ్‌కు చెందిన ‌బ్రిడ్జర్ తన చిన్న చెల్లిని కుక్క నుంచి కాపాడాడు. జులై 9న ఒక కుక్క త‌న చెల్లి వ‌ద్ద‌కు రాగానే బ్రిడ్జ‌ర్ అడ్డుగా నిల్చున్నాడు. ఆ కుక్క బ్రిడ్జ‌ర్‌పై దాడి చేసింది. అత‌ని ఎడ‌మ చెంప‌పై తీవ్రంగా కొరికింది. అయినా ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా సోద‌రితో అక్క‌డి నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. వైద్యం చేసిన త‌ర్వాత‌ బ్రిడ్జ‌ర్‌కు 90 కుట్లు ప‌డ్డాయి. ముఖం అంతా భ‌యంక‌రంగా మారిపోవ‌డంతో అత‌నికి ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేపించారు. ఇప్పుడు బ్రిడ్జ‌ర్ మామూలు స్థితికి వ‌చ్చేశాడు. అత‌ని ధైర్య సాహ‌సాల గురించి బ్రిడ్జ‌ర్ మేన‌త్త సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి అమెరిక‌న్ యాక్ట‌ర్ మార్క్ రుఫ‌లో అభినంద‌న‌లు తెలిపారు. 'నేటి త‌రానికి ఆద‌ర్శ‌వంతుడివి' అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.logo