శనివారం 31 అక్టోబర్ 2020
International - Sep 22, 2020 , 16:14:14

‌'వ‌ర‌ల్డ్ రికార్డు'‌ను బ్రేక్ చేసిన‌ ఆరు నెల‌ల బుడ్డోడు.. నీటిలో సాహ‌సాలు!

‌'వ‌ర‌ల్డ్ రికార్డు'‌ను బ్రేక్ చేసిన‌ ఆరు నెల‌ల బుడ్డోడు.. నీటిలో సాహ‌సాలు!

ఎవ‌రూ లేకుండా ఒంట‌రిగా స‌ముద్రం వ‌ద్ద నిల్చొని అటు చివ‌ర నుంచి ఇటు చివ‌ర వ‌ర‌కు చూస్తే చాలు భ‌యం వేస్తుంది. అలాంటిది నీటిలో అడ్వెంచ‌ర్లు చేయ‌డంటే పెద్ద‌వాళ్లు సైతం మావ‌ల్ల కాదంటూ వెన‌క్కి వెళ్లిపోతారు. ఆరు నెల‌ల బుడ్డోడు అప్పుడ‌ప్పుడే నిల‌బ‌డ‌టం నేర్చుకుంటున్నాడు. స‌పోర్ట్ లేక‌పోతే కింద‌ప‌డిపోవ‌డం ఖాయం. అంత చిన్న బుడ్డోడు నీటిలో సాహ‌సాలు చేస్తున్నాడు. త‌న ఆరు నెల‌ల పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప్రపంచ రికార్డును నెలకొలిపే సాహసాన్ని చేసినట్లు త‌ల్లిదండ్రులు వెల్ల‌డించారు.

క్యాసీ, మిండి హంఫరీస్‌ అనే ఓ జంట ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో తమ ఆరు నెలల పసివాడు ఉటాలోని లేక్ పావెల్‌లోని సరస్సులో స్కీయింగ్ చేస్తున్న వీడియోను పోస్టు చేశారు. కొడుకు పేరు రిచ్ క్యాసీ హంఫ‌రీస్‌. ఈ వీడియోలో బుడ్డోడు లైఫ్ జాకెట్ వేసుకుని స్కియింగ్ బార్స్‌ను ప‌ట్టుకొని హీరోలా ధైర్యంగా నీటిపై దూసుకెళ్తున్నాడు. వాడిని అల‌రిస్తూ తండ్రి ప‌క్క బోట్‌లోనే ప్ర‌యాణిస్తున్నాడు. ఈ రికార్డును 2016లో ఆరు నెల‌ల 27 రోజుల వ‌య‌సులో, జైలా ఓంగే పేరుపై రికార్డు న‌మోదై ఉంది. ఇప్పుడు ఈ బుడ్డోడు ఆరు నెల‌ల 4 రోజులోనే ఈ సాహ‌సం చేసి రికార్డు బ్రేక్ చేశాడు. ప్ర‌పంచంలోనే అత్యంత చిన్న వ‌య‌సులో వాట‌ర్ స్కీయింగ్ చేసిన ప‌సివాడుగా ఈ బుడ్డోడు పేరు గాంచాడు. వీడి సాహ‌సాన్ని ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి.