బ్రసిలియా, అక్టోబర్ 9: బ్రెజిల్లో కరోనా మరణాల సంఖ్య 6 లక్షలు దాటింది. ప్రపంచంలో అత్యధికంగా కరోనా మరణాలు సంభవించిన దేశం అమెరికా కాగా… రెండో స్థానంలో బ్రెజిల్ ఉంది. బ్రెజిల్లో ప్రస్తుతం సగటున రోజుకి 453 మరణాలు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కేవలం 51 రోజుల్లో 4 లక్షల నుంచి 5 లక్షలకు పెరుగ్గా, 5 లక్షల నుంచి 6 లక్షలు చేరడానికి 111 రోజులు పట్టింది.