సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 14, 2020 , 01:24:47

ఆరడుగుల దూరం సరిపోదు! 16 అడుగుల వరకు వైరస్‌ వ్యాప్తి

ఆరడుగుల దూరం సరిపోదు! 16 అడుగుల వరకు వైరస్‌ వ్యాప్తి

న్యూయార్క్‌: కరోనా మహమ్మారి గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్నది. వైరస్‌ సోకకుండా ఉండేందుకు ప్రస్తుతం పాటిస్తున్న ఆరడుగుల (రెండు మీటర్ల) భౌతిక దూరం నియమంతో ఉపయోగం లేదని అమెరికాలోని ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన వైరాలజీ నిపుణులు చెబుతున్నారు. గది లోపలి వాతావరణంలో ఏడు నుంచి 16 అడుగుల దూరం (రెండు మీటర్ల నుంచి 4.8 మీటర్లు) వరకు గాలి ద్వారా కరోనా వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఇప్పుడున్న భౌతిక దూరం మార్గదర్శకాలను సవరించాల్సిన అవసరమున్నదన్నారు. చిన్న చిన్న తుంపర్లు, దగ్గు ద్వారా గాల్లోకి ప్రవేశిస్తున్న కరోనా వైరస్‌లోని జన్యు క్రమం, రోగులలోని వైరస్‌ జన్యు క్రమం ఒకేలా ఉన్నదని వివరించారు. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, ముఖానికి మాస్కును ధరించడం, భౌతిక దూరం నియమాలను పాటించడం, జన సమ్మర్థ ప్రాంతాల్లోకి వెళ్లకపోవడం వంటి నియమాలను మరింత జాగ్రత్తగా పాటించాలన్నారు.


logo