శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Feb 17, 2020 , 07:08:04

విష వాయువులు లీక్‌ : ఆరుగురు మృతి

విష వాయువులు లీక్‌ : ఆరుగురు మృతి

కరాచీ : విష వాయువులు లీక్‌ కావడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన పాకిస్తాన్‌లోని కరాచీలో ఆదివారం చోటు చేసుకుంది. కియామేరి జెట్టీ వద్ద కార్గో షిప్‌ నుంచి రసాయనాలను ఆన్‌లోడ్‌ చేస్తుండగా.. ఈ విష వాయువులు లీక్‌ అయినట్లు సమాచారం. దీంతో అక్కడ వాతావరణం కలుషితమై.. ఆరుగురు చనిపోయారు. ఈ వాయువులను పీల్చిన కొందరు శ్వాస సమస్యలతో బాధపడుతున్నారు. బాధితులందరికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సింధ్‌ ముఖ్యమంత్రి మురాద్‌ అలీ షా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 


logo