మంగళవారం 26 మే 2020
International - Apr 18, 2020 , 15:20:38

జపాన్‌లో భారీ భూకంపం

జపాన్‌లో   భారీ భూకంపం

టోక్యో:  జపాన్ పశ్చిమ తీరం ఒగాసవరా దీవుల్లో శనివారం  భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. శనివారం స్థానిక కాలమానం ప్రకారం 17:26(JST) గంటలకు  490 కిలోమీటర్ల లోతున   భూకంపం సంభవించిందని జపాన్‌ అధికారులు తెలిపారు. సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.

ఈ భూప్రకంపనలతో ఇప్పటికైతే ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లలేదని జపాన్ అధికారులు చెప్పారు.   ఈ స్థాయి భూ ప్రకంపనలు వచ్చినపుడు నిలబడడం కూడా కష్టమవుతుంది. ప్రపంచంలో 6.0 లేదా అంతకు మించి వచ్చే భూ ప్రకంపనల్లో 20 శాతం జపాన్‌లోనే సంభవిస్తాయి.


logo