బుధవారం 03 జూన్ 2020
International - Apr 17, 2020 , 17:21:54

చైనా జీడీపీలో 6.8 శాతం న‌ష్టం!

చైనా జీడీపీలో 6.8 శాతం న‌ష్టం!

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి చైనాను బాగానే న‌ష్ట‌ప‌ర్చింది. కరోనా వైరస్ విస్త‌ర‌ణ కారణంగా ఆ దేశంలో కొన్నాళ్ల‌పాటు ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో గత ఏడాదితో పోల్చితే చైనా జీడీపీలో 6.8 శాతం నష్టం వాటిల్లింది. మార్చి నెల నాటికి వెలువ‌డ్డ‌ త్రైమాసిక ఫలితాల ఆధారంగా ఈ నష్టం వివరాలు స్పష్టమయ్యాయని అధికారులు తెలిపారు. చైనాలో 1979లో మార్కెట్‌ తరహా ఎకానమీ విధానాలు ప్ర‌వేశ‌పెట్టింది మొద‌లు ఇంత‌టి నష్టం వాటిల్లడం ఇదే మొదటిసార‌ని వారు పేర్కొన్నారు. వుహాన్‌ పట్టణంలో పుట్టిన‌ కరోనా వైరస్‌ కట్టడికి చైనా అంతట లాక్‌డౌన్ విధించారు. పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, మాల్స్, మార్కెట్లను మూసివేశారు. 

దీనివల్ల దేశ ఆర్థికవ్యవస్థకు న‌ష్టం జ‌రుగుతుంద‌ని ముందే ఊహించిన చైనా ఒక్క వుహాన్‌లో మినహా దేశ‌మంత‌టా మార్చి నెలలోనే లాక్‌డౌన్‌ను ఎత్తివేసింది. దెబ్బతిన్న చైనా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మూడు లేదా నాలుగోవారంలో కోలుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. చైనా రిటైల్‌ అమ్మకాలు గత ఏడాదితో పోల్చితే 19 శాతం పడిపోయాయి. పర్యాటక రంగం కూడా దెబ్బతిన్నది. సినిమాలు, హేర్ సెలూన్లు, ఇతర వినోద కార్యకలాపాలు ఇప్పటికీ నిలిచిపోయే ఉన్నాయి. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo