బుధవారం 12 ఆగస్టు 2020
International - Jul 11, 2020 , 18:03:48

రష్యాలో 24 గంటల్లో 6,611 కరోనా కేసులు

రష్యాలో 24 గంటల్లో 6,611 కరోనా కేసులు

మాస్కో : రష్యాలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రష్యాలో 6,611 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 7,20,547కు చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. శనివారం వచ్చిన 6,611 కేసుల్లో సుమారు 1,766 మందికి ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. మాస్కో నగరంలో గడిచిన 24 గంటల్లో 678 కేసులు నమోదు కాగా ఎస్టీ పీటర్స్‌ బర్గ్‌లో 296 కేసులు నమోదయ్యాయి. 

అదే విధంగా శనివారం 8,378 మంది కరోనా బారి నుంచి కోలుకొని దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు.  ఇప్పటివరకు 4,97,446 మంది కోలుకున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. అయితే గడిచిన 24 గంటల్లో 188 మంది కరోనా రోగులు మరణించగా ఇప్పటి వరకు మొత్తం 11,205 మంది మృత్యువాత పడినట్లు తెలిసింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo