శనివారం 30 మే 2020
International - Apr 02, 2020 , 18:35:55

అమెరికాలో 66 ల‌క్ష‌ల మంది నిరుద్యోగులు..

అమెరికాలో 66 ల‌క్ష‌ల మంది నిరుద్యోగులు..

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ అమెరికాను క‌కావిక‌లం చేస్తున్న‌ది. ఆ దేశంలో నిరుద్యోగం అత్య‌ధిక స్థాయికి చేరుకున్న‌ది.  సుమారు 66 ల‌క్ష‌ల మంది అమెరిక‌న్లు ప్ర‌స్తుతం నిరుద్యోగులుగా ఉన్నారు. ప్ర‌భుత్వం రిలీజ్ చేసిన తాజా నివేదిక‌ల‌ను బ‌ట్టి ఈ విష‌యం తెలుస్తున్న‌ది.  నిరుద్యోగ ల‌బ్ధి క‌ల్పించాలంటూ గ‌త వారం 66  ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నారు. ఇది అంత‌కు ముందు రికార్డును బ్రేక్ చేసింది.  అంత‌క‌ముందు వారం సుమారు 33 ల‌క్ష‌ల మంది నిరుద్యోగ భృతి కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అమెరికా చరిత్ర‌లో ఇంత మంది జ‌నం నిరుద్యోగ ల‌బ్ధి కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం 1982 త‌ర్వాత ఇదే మొద‌టిసారి.  ఆ సంవ‌త్స‌రంలో సుమారు ఆరు ల‌క్ష‌ల 95 వేల మంది నిరుద్యోగ భృతి కోసం ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నారు.  వైర‌స్ నియంత్ర‌ణ కోసం దేశ‌వ్యాప్తంగా రిస్టారెంట్లు, బార్లు, సినిమాలు, హోట‌ళ్లు, జిమ్‌లు మూసివేయ‌డంతో ఈ ప‌రిస్థితి ఎదుర‌వుతున్న‌ది.

  logo