గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Aug 18, 2020 , 07:47:57

ఫిలిప్పీన్స్‌లో భూకంపం

ఫిలిప్పీన్స్‌లో భూకంపం

మనీలా : ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలా ఆగ్నేయ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.4గా  నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం ట్విట్టర్‌లో పేర్కొంది. ఫిలిప్పీన్స్‌కు 12.07 అక్షాంశ, 124.25 రేఖాంశాలకు 10 కిలోమీటర్ల లోతులో మనీలాకు 451 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపం సంభవించిందని తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనాలు ఇండ్ల నుంచి పరుగులు తీశారు. భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు.


logo