గురువారం 29 అక్టోబర్ 2020
International - Oct 01, 2020 , 15:01:02

పసిఫిక్‌ మహాసముద్రంలో భూకంపం..

పసిఫిక్‌ మహాసముద్రంలో భూకంపం..

టోన్గా : పసిఫిక్‌ మహాసముద్రంలోని టోన్గా తీర ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.4గా నమోదైనట్లు యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే (యూసీఎస్‌జీఎస్‌) తెలిపింది. అర్ధరాత్రి ఒంటిగంటా 13 నిమిషాల సమయంలో ప్రకంపనలు సంభవించినట్లు పేర్కొంది. లైఫ్కా ద్వీపం పశ్చిమతీరానికి 37 కిలోమీటర్ల దూరంలోని పంగై గ్రామానికి ఈశాన్యంగా 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నిక్షిప్తమై ఉందని వెల్లడించింది. భూప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు. సునామి హెచ్చరికలు సైతం జారీ చేయలేదు. టోన్గా రాజ్యం రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌గా ప్రసిద్ధి. ఇది భూకంప క్రియాశీల జోన్‌లో ఉండటంతో తరచూ భారీ భూకంపాలు సంభవిస్తుంటాయి.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo