మంగళవారం 19 జనవరి 2021
International - Dec 16, 2020 , 07:39:47

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

మనీలా: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. మిండనావు ప్రాంతంలో ఇవాళ తెల్లవారు జామున భూమి కంపించింది. దీని తీవ్రత 6.3గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ ప్రకటించింది. ఇవాళ ఉదయం 4.52 గంటల ప్రాంతంలో భూమి కంపించిందని, భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. కాగా, భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో సంభవించిన భూకంపం వల్ల ఒకరు మరణించగా, 12 మంది గాయపడ్డారు. భారీగా ఆస్తినష్టం జరిగింది.