మంగళవారం 31 మార్చి 2020
International - Jan 28, 2020 , 01:04:51

సాలమన్‌ ద్వీపాల్లో భూకంపం

 సాలమన్‌ ద్వీపాల్లో భూకంపం

సిడ్నీ: సాలమన్‌ ద్వీపాల్లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 6.3గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలను జారీచేయలేదు. సాలమన్‌ రాజధాని హోనియారాకు ఆగ్నేయంగా 140 కి.మీ. దూరంలో 17.7 కి.మీ లోతున స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు గంటలకు భూకంపం వచ్చినట్టు పేర్కొన్నది. దీని ప్రభావంతో హోనియారాలో ప్రాణనష్టం లేదని, పెద్దగా ఆస్తినష్టం కూడా సంభవించలేదని అధికారులు తెలిపారు. సాలమన్‌ ద్వీపాల్లో భూకంపాలు సర్వసాధారణం. 2013 సంవత్సరంలో 8.0 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా భారీ సునామీ వచ్చింది.


logo
>>>>>>