బుధవారం 03 జూన్ 2020
International - May 02, 2020 , 02:22:17

ఎవరెస్ట్‌పై 5జీ!

ఎవరెస్ట్‌పై 5జీ!

  • పనులు మొదలుపెట్టిన చైనా సంస్థ

బీజింగ్‌, మే 1: చైనా వైపు నుంచి ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించే పర్వతారోహకులకు 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు టిబెట్‌ పరిధిలో ప్రభుత్వ రంగ టెలికం సంస్థ ‘చైనా మొబైల్‌' నిర్మించిన బేస్‌ స్టేషన్‌ తన కార్యకలాపాలు ప్రారంభించిందని ఆ దేశ అధికార మీడియాలో వార్తలొచ్చాయి. సముద్ర తీరానికి 6,500 మీటర్ల ఎత్తున నిర్మించిన ఈ బేస్‌ స్టేషన్‌ సేవలు గురువారం మొదలయ్యాయి. ఎవరెస్ట్‌ పర్వతశిఖరంపై పూర్తిస్థాయిలో 5జీ సేవలను వాస్తవ రూపంలో అందుబాటులోకి తెచ్చేందుకు 5,300 మీటర్లు, 5,800 మీటర్ల ఎత్తున కూడా బేస్‌ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేశారని చైనా అధికార వార్తా సంస్థ ‘జిన్హువా’ తెలిపింది. ఎత్తైన ప్రదేశంలో ఐదు 5జీ స్టేషన్ల నిర్మాణానికి 14.2 లక్షల డాలర్లు ఖర్చవుతుందని చైనా అధికార వర్గాలు తెలిపాయి. ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించే పర్వతారోహకులు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్‌ సంబంధాలను మెరుగు పరుచుకునేందుకు ఈ ఐదు 5జీ స్టేషన్లు ఉపకరిస్తున్నాయి. పరిశోధకులకు, సహాయ సిబ్బందికి కూడా సహాయకారిగా ఉంటాయి. 5,300 మీటర్ల ఎత్తున నిర్మించిన 5జీ స్టేషన్‌ను బేస్‌ స్టేషన్‌గా వినియోగించుకోనున్నారు. 5జీ సేవలను పర్వాతారోహకులు, పర్యాటకులు, స్థానికులు ఉపయోగించుకోవచ్చు. 


logo