బుధవారం 03 జూన్ 2020
International - Apr 06, 2020 , 10:30:42

5జీతో వైర‌స్ వ్యాపించ‌దు..

5జీతో వైర‌స్ వ్యాపించ‌దు..

హైద‌రాబాద్‌: క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న తీరు అంద‌ర్నీ భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్న‌ది. ఆ టెన్ష‌న్‌లో కొంద‌రు త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అలాంటి ఫేక్ న్యూస్ ఇప్పుడు బ్రిట‌న్‌లోనూ తీవ్ర న‌ష్టాన్ని క‌లిగిస్తున్న‌ది. 5జీ టెలికాం సేవ‌ల వ‌ల్లే నోవెల్ క‌రోనా వైర‌స్ సోకుతున్న‌ట్లు అక్క‌డ వ‌దంతులు వ్యాపిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో చెల‌రేగిపోతున్న ఆ ఫేక్ న్యూస్‌తో జ‌నం హైరానాప‌డుతున్నారు.  ఆ భ‌యంలో 5జీ ట‌వ‌ర్ల‌ను ధ్వంసం చేస్తున్నారు.   ఇప్ప‌టికే బ్రిట‌న్‌లో అయిదారు ట‌వ‌ర్ల‌కు నిప్పుపెట్టారు.  అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌ల‌పై పోలీసులు ఆరా తీస్తే ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. 5జీ టెక్నాల‌జీతో మొబైల్ ఇంట‌ర్నెట్ సేవ‌లు వేగంగా అందుతాయి. అయితే ఈమ‌ధ్య వుహాన్ న‌గ‌రంలో 5జీ సేవ‌లు స్టార్ట్ చేశారు. అప్ప‌టి నుంచే అక్క‌డ ఈ వైర‌స్ కేసులు ఎక్కువ అయిన‌ట్లు పుకార్లు పుట్టాయి. ఫేస్‌బుక్ లాంటి సోష‌ల్ సైట్ల‌తో ఆ ఫేక్ వార్త‌లు ఇప్పుడు బ్రిట‌న్‌లో దాడుల‌కు దారితీస్తున్నాయి. 5జీతో వైర‌స్ వ్యాప్తిస్తుంద‌న్న వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. వైద్య నిపుణులు, శాస్త్ర‌వేత్త‌లు కూడా ఫేక్ వార్త‌ల‌ను ఖండిస్తున్నారు. logo