శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 06, 2020 , 12:33:14

కువైట్ క‌రోనా బాధితుల్లో 58 మంది భార‌తీయులు

కువైట్ క‌రోనా బాధితుల్లో 58 మంది భార‌తీయులు

న్యూఢిల్లీ: గల్ఫ్ దేశం కువైట్‌లోనూ రోజురోజుకు కరోనా మ‌హ‌మ్మారి విస్త‌రిస్తున్న‌ది. గ‌త కొన్ని రోజులుగా చాప‌కింద నీరులా మెల్ల‌మెల్ల‌గా విస్త‌రించిన క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్పుడు ఒక్క‌సారిగా విజృంభిస్తున్న‌ది. గత 24 గంటల్లోనే అక్క‌డ‌ కొత్తగా 77 కేసులు నమోదయ్యాయి. దీంతో కువైట్‌లో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 556కు చేరింది. కాగా అందులో 99 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. శ‌నివారం మ‌న‌దేశానికే చెందిన‌ ఒక వ్య‌క్తి మ‌ర‌ణించాడు. కువైట్‌లో న‌మోదైన మొత్తం 556 క‌రోనా కేసుల్లో కూడా 58 మంది భారతీయులే ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. భార‌తీయుల‌తోపాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇరాన్‌కు చెందిన వారు కువైట్ క‌రోనా బాధితుల్లో ఉన్నార‌ని వారు తెలిపారు. కాగా, కువైట్‌లో ఇంకా 456 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే వారిలో 17 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ద‌ని కువైట్ ఆరోగ్య విభాగం అధికారులు తెలిపారు.  

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo