సోమవారం 06 ఏప్రిల్ 2020
International - Mar 04, 2020 , 10:22:32

క‌రోనా వైర‌స్‌.. 54వేల మంది ఖైదీల‌కు విముక్తి

క‌రోనా వైర‌స్‌.. 54వేల మంది ఖైదీల‌కు విముక్తి

హైద‌రాబాద్‌:  ఇరాన్‌లో క‌రోనా వైర‌స్ కేసులు సుమారు 2300 దాటాయి. ఆ దేశంలో దాదాపు 77 మంది మ‌ర‌ణించారు.  ఇరాన్‌కు చెందిన చ‌ట్ట‌స‌భ ప్ర‌తినిధుల్లో సుమారు 8 శాతం మందికి క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. అయితే క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టాల‌న్న ఉద్దేశంతో.. తాజాగా ఆ దేశం 54 వేల మంది ఖైదీల‌ను రిలీజ్ చేసింది.  కిక్కిరిస‌న జైళ్ల‌లో క‌రోనా వ్యాప్తి చెంద‌కుండా ఉండేందుకు.. ఈ చ‌ర్య‌ల‌కు దిగిన‌ట్లు తెలుస్తోంది. కోవిడ్‌19 ప‌రీక్ష‌లో నెగ‌టివ్‌గా తేలిన ఖైదీల‌ను జైలు నుంచి రిలీజ్ చేస్తున్న‌ట్లు ఆ దేశ న్యాయ‌ప్ర‌తినిధి గోల‌మ్‌హోస‌న్ ఇస్మాయిలీ తెలిపారు. అయితే అయిదేళ్ల క‌న్నా ఎక్కువ కాలం శిక్ష ప‌డిన వారిని మాత్రం విడుద‌ల చేయ‌డం లేదు. బ్రిట‌న్‌, ఇరాన్‌కు చెందిన ఛారిటీ వ‌ర్క‌ర్ న‌జానిన్ జ‌గారీ రాట్‌క్లిఫ్‌ను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఓ బ్రిటీష్ ఎంపీ తెలిపారు. చైనాలో క‌రోనా వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య 2981కి చేరుకున్న‌ది. మొత్తం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3200 దాటింది. వైర‌స్ సోకిన వారి సంఖ్య 92వేలు దాటింది.



logo