శనివారం 06 జూన్ 2020
International - Apr 11, 2020 , 17:50:50

స్పెయిన్‌లో వరుసగా మూడో రోజూ 500కు పైగా కరోనా మృతులు

స్పెయిన్‌లో వరుసగా మూడో రోజూ 500కు పైగా కరోనా మృతులు

హైదరాబాద్‌: స్పెయిన్‌లో వరుసగా మూడో రోజూ కరోనా వైరస్‌ మరణ మృదంగం కొనసాగింది. గత 24 గంటల్లో 510 మంది ఈ వైరస్‌ ప్రభావంతో మరణించారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 16,353కు చేరింది. ఈ మహమ్మారి వల్ల శుక్రవారం 605 మంది, గురువారం 683 మంది మరణించారు. అదేవిధంగా దేశంలో కొత్తగా 4,830 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే గురువారం నమోదైన కేసులతో పోల్చితే గత రెండు రోజులుగా కొంత తగ్గుదల కనిపిస్తున్నది. గురువారం 5756 నమోదవగా, శుక్రవారం 4576 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో 59,109 మంది మరణించగా, 1,61,852 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


logo