శనివారం 06 జూన్ 2020
International - May 18, 2020 , 07:02:37

ఈజిప్టులో ఒక్కరోజే 510 కరోనా కేసులు

ఈజిప్టులో ఒక్కరోజే 510 కరోనా కేసులు

పది కోట్ల జనాభా కూడా లేని ఈజిప్టులో కరోనా విజృంభిస్తుంది. ఆదివారం ఒక్కరోజే అక్కడ రికార్డు స్థాయిలో 510 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12229 కి చేరింది. దీంతో పాటు తాజాగా ఈజిప్టులో మరణించిన వారి సంఖ్య 18 మందిగా ఉంటే మొత్తం మరణాల సంఖ్య 630కి చేరింది. కరోనా విజృంభన వివరాలను ఆదివారం ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఖలీద్‌ మెగాహెడ్‌ ఒక ప్రకటనలో తెలిపినట్లు అక్కడి వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. అలాగే ఆదివారం కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం రికవరీ కేసులు 3172 మంది ఉండగా ఆదివారం ఒక్కరోజే 222 మంది రికవరీ అయ్యారు. అయతే ప్రస్తుతం రంజాన్‌ మాసం అయినందువల్ల దేశ వ్యాప్తంగా షాపింగ్‌, ఇతర విందు కార్యక్రమాలు, మాల్స్‌, రెస్టారెంట్లు. పబ్లిక్‌ పార్కులు, ప్రజా రవాణా నిలిపివేసారు. వచ్చే నెల నుంచి కొన్ని కార్యకలాపాలకు సడలింపులు ఇచ్చేందుకు ఆలోచిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.


logo