శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Sep 11, 2020 , 11:02:56

ఒరేగాన్ దావాన‌లం.. 5 ల‌క్ష‌ల మంది త‌ర‌లింపు

ఒరేగాన్ దావాన‌లం.. 5 ల‌క్ష‌ల మంది త‌ర‌లింపు

హైద‌రాబాద్‌: అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రంలో దావాన‌లం ద‌హించి వేస్తున్న‌ది.  ప‌సిఫిక్ తీరం నుంచి వీస్తున్న గాలుల‌ వ‌ల్ల ఓరేగాన్ అడ‌వుల్లో కార్చిచ్చు ర‌గిలింది.  దీంతో సుమారు 5 ల‌క్ష‌ల మంది సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లి వెళ్తున్నారు.  వేడిగా వీస్తున్న బ‌ల‌మైన పొడి గాలుల వ‌ల్ల‌.. అమెరికా ప‌శ్చిమ రాష్ట్రాల్లోని అడ‌వులు అంటుకుంటున్నాయి. దీంతో ఓరేగాన్‌లో డ‌జ‌న్ల సంఖ్య‌లో అడ‌వి మంట‌లు ఎగిసిప‌డుతున్నాయి. మంట‌ల వ‌ల్ల సుమారు న‌లుగురు చ‌నిపోయి ఉంటార‌ని గ‌వ‌ర్న‌ర్ కేట్ బ్రౌన్ తెలిపారు. అయితే 12 రాష్ట్రాల్లో దాదాపు వంద‌కు పైగా కార్చిచ్చులు అంటుకున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. ఒరేగాన్‌, కాలిఫోర్నియా, వాషింగ్ట‌న్ రాష్ట్రాల్లో నిప్పు క‌ణిక‌లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ రాష్ట్రాల్లోని చాలా వ‌ర‌కు ప‌ట్ట‌ణాలు ద‌గ్ధం అయ్యాయి. కాలిఫోర్నియాలో క‌నీసం 10 మంది మృతిచెందారు. ఆ రాష్ట్రం నుంచి వెలువడుతున్న పొగ‌తో ఆకాశం ఆరెంజ్ రంగులోకి మారింది. కాలిఫోర్నియాలో దాదాపు 44 ల‌క్ష‌ల ఎక‌రాల అడ‌వి నాశ‌న‌మైంది. ఒరేగాన్ రాష్ట్రంలోని 42 ల‌క్ష‌ల జ‌నాభాలో ప‌ది శాతం మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించిన‌ట్లు చెబుతున్నారు.   


logo