గురువారం 01 అక్టోబర్ 2020
International - Aug 20, 2020 , 12:25:38

వీరిద్ద‌రూ త‌ల్లీకూతుళ్లు.. కానీ వీరిలో త‌ల్లి ఎవ‌రో గుర్తించ‌గ‌ల‌రా?

వీరిద్ద‌రూ త‌ల్లీకూతుళ్లు.. కానీ వీరిలో త‌ల్లి ఎవ‌రో గుర్తించ‌గ‌ల‌రా?

ఈ మ‌ధ్య  త‌ల్లీకూతుళ్ల‌ను చూస్తుంటే ఎవ‌రు త‌ల్లో, ఎవ‌రు కూతురో క‌నుక్కోలేక‌పోతున్నారు. నిజం చెప్పాలంటే కూతుళ్లు క‌న్నా త‌ల్లే యంగ్‌గా క‌నిపిస్తుంది. కార‌ణం వారు తినే ఆహారం. ఫాస్ట్‌ఫుడ్‌కి అలవాటు ప‌డ‌డం వ‌ల్ల నేటిత‌రం త్వ‌ర‌‌గా పెద్ద‌వాళ్లై పోతున్నారు. ఈ త‌ల్లీకూతుళ్ల‌ను చూస్తుంటే అక్కాచెల్లెళ్లా ఉన్నారు. కాద‌ని తెలియ‌జేయ‌డానికి ఆ త‌ల్లి ఎక్క‌డికి వెళ్లినా త‌న ఐడీ కార్డును వెంట తీసుకెళ్తుంది.

వెస్ట్ మిడ్‌లాండ్స్‌లోని కోవెంట్రీలో నివసించే 50 ఏండ్ల రంజ‌న్ గిల్‌కు 19 ఏండ్ల కుమార్తె ఉంది. వీరిద్ద‌రినీ చూసిన వారెవ‌రైనా అక్కాచెల్లెళ్లు అనుకోవ‌డం ఖాయం అంటున్నారు. త‌ల్లి దుకాణానికి వెళ్లిన‌ప్పుడ‌ల్లా తెల్ల ముఖం వేసుకొని వ‌స్తుంద‌ట‌. ఎందుకంటే అక్క‌డి వారంతా ఆమె మీ సోద‌రా అని అడుగుతున్నారు. కాదు నా కూతురు అంటే ఏదీ ప్రూఫ్ చూపించండి అంటున్నార‌ట‌. అందుకే ఆమె, కూతురితో ఎక్క‌డికి వెళ్లినా చేతిలో ఐడీ ఉండాల్సిందే. అలా అడిగిన‌ప్పుడ‌ల్లా ఆ త‌ల్లి ఎంతో ఆనందానికి గుర‌వుతుంది. ఎందుకంటే ఆమె ఫాస్ట్‌ఫుడ్‌కి దూరంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యం, అందం విష‌యంలో చాలా కేర్ కూడా తీసుకుంటుంది. 

తాజావార్తలు


logo