ఓపెన్‌సోర్స్ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా అందజేస్తాం: కేంద్రం
న్యూఢిల్లీ, జూన్ 28: దేశంలో వ్యాక్సినేషన్ కోసం కేంద్రం తీసుకొచ్చిన కొవిన్ పోర్టల్‌పై దాదాపు 50కి పైగా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. వీటిలో కెనడా, మెక్సికో, నైజీరియా, పనామా తదితర దేశాలున్నాయి. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వ ‘కొవిడ్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్’ చైర్మన్ డాక్టర్ ఆర్ ఎస్ శర్మ సోమవారం వెల్లడించారు. కొవిన్ పోర్టల్‌కు సంబంధించిన ఓపెన్‌సోర్స్ సాఫ్ట్‌వేర్‌ను ఆయాదేశాలతో ఉచితంగా పంచుకోవటానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. 130 కోట్ల మంది దేశప్రజలకు టీకాలు వేయటమనేది చిన్న విషయం కాదని, ఈ బృహత్తర కార్యంలో కొవిన్ పాత్ర కీలకమని అన్నారు. కొవిన్ వంటి డిజిటల్ వేదికలను సొంతంగా తయారుచేయటం ద్వారా భారత్ శక్తిసామర్థ్యాలు ఏమిటో వెల్లడయ్యాయని తెలిపారు. వచ్చే నెల 5న ఆరోగ్య, టెక్నాలజీ నిపుణులతో ప్రపంచస్థాయి సదస్సు వర్చువల్‌గా జరుగనుందని.. దీంట్లో కొవిన్ ఎలా పని చేస్తుందో తెలియజేయటంతోపాటు, దానికి సంబంధించిన ఓపెన్‌సోర్స్ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా అందజేయనున్నట్లు ప్రకటిస్తామని వెల్లడించారు.