శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 01, 2020 , 21:42:49

నిమిషానికి 50 కేసులు...గంట‌కు 29 మ‌ర‌ణాలు

నిమిషానికి 50 కేసులు...గంట‌కు 29 మ‌ర‌ణాలు

ప్ర‌పంచ‌వ్యావ్తంగా క‌రోనా మ‌హమ్మారి విల‌య‌తాండ‌వం చేస్తోంది . ఎంత‌లా అంటే గంట‌ల వ్య‌వ‌ధిలోనే వేల‌ల్లో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇక యూర‌ప్ దేశాల్లో ప‌రిస్థితి అత్యంత దారుణంగా ఉన్న‌ది. అమెరికా, ఇట‌లీ, స్పెయిన్‌, బ్రిట‌న్ దేశాల్లో జ‌నం పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. ఇప్ప‌టికే మ‌ర‌ణాల సంఖ్య 50వేల‌కు చేరువైంది. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా  న‌మోదైన క‌రోనా కేసుల్లో మ‌ర‌ణాల సంఖ్య 19శాతంగా ఉన్న‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి. మ‌ర‌ణాల సంఖ్య అలా ఉంటే కొత్త‌గా న‌మోద‌వుతున్న కేసుల సంఖ్య నిమిషానికి 50గా ఉంటున్నాయి. మ‌ర‌ణాలు గంట‌కు 29దాకా ఉంటున్నాయి. ఇక మొత్తం కేసుల్లో 81శాతం మంది రిక‌వ‌రీ అవుతున్నార‌ని అంచ‌నా. అదే భార‌త్‌లో చూస్తే క‌రోనా కేసుల్లో దాదాపు 9శాతం మంది రిక‌వ‌రీ అయినట్లు గుర్తించారు.


logo