శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Sep 06, 2020 , 21:29:34

50,000 మందిపై చైనా కొవిడ్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌..

50,000 మందిపై చైనా కొవిడ్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌..

బీజింగ్‌: కరోనా వ్యాప్తికి కారణంగా భావిస్తున్న చైనా దానిని నిరోధించే వ్యాక్సిన్‌ తయారీలో దూసుకుపోతున్నది. తాము అభివృద్ధి చేసిన కరోనా వైరస్ టీకా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను వివిధ దేశాల్లోని 50,000 మంది వలంటీర్లపై నిర్వహిస్తున్నట్లు చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ (సీఎన్‌బీజీ) కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. 

‘కొవిడ్‌-19కు అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ వేగవంతమవుతున్నాయి.  బహ్రెయిన్, యూఏఈ, మొరాకో, పెరూ, అర్జెంటీనాతో సహా అనేక దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ ఇప్పటికే జరుగుతున్నాయి. సుమారు 50,000 మంది పాల్గొంటున్నారు.’ అని సీఎన్‌బీజీ వెల్లడించింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన టీకా మూడో దశ ట్రయల్స్‌ ఉజ్బెకిస్తాన్‌లో కూడా జరుగుతుందని కంపెనీ జూలైలో తెలిపింది. కాగా, క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు పాకిస్తాన్ కూడా ఆసక్తి చూపించింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo