శనివారం 28 నవంబర్ 2020
International - Nov 06, 2020 , 15:11:16

వైక‌ల్యాన్ని జ‌యించిన బుడ‌త‌డు..వీడియో వైర‌ల్‌

వైక‌ల్యాన్ని జ‌యించిన బుడ‌త‌డు..వీడియో వైర‌ల్‌

ఆ చిన్నారి పుట్టుక‌తోనే అంగ‌వైకల్యంతో జ‌న్మించాడు. నాలుగేళ్లు దాటినా మెల్ల‌మెల్ల‌గా న‌డ‌వాల్సిన ఆ చిన్నారికి వైకల్యం అడ్డు వ‌చ్చింది. దీంతో త‌మ కొడుకును ఎలాగైనా న‌డిపించాల‌ని భావించారు త‌ల్లిదండ్రులు. త‌మ కొడుకుకు అడుగులు వేసేలా మ‌నోధైర్యాన్ని క‌ల్పించారు. ఇప్పు‌డా చిన్నారికి ఐదేళ్లు. తొలిసారిగా ఆ బుడ‌త‌డు అడుగులు వేస్తున్న వీడియో ఇపుడు నెటిజ‌న్లను ఆక‌ట్టుకుంటోంది.

ది ఫీల్ గుడ్ ట్విట‌ర్ పేజ్లో చిన్నోడు బుడిబుడి అడుగులు వేస్తూ సోఫా ఛైర్ ద‌గ్గ‌రికి వ‌చ్చిన వీడియోను అత‌ని త‌ల్లి తీస్తూ.. గుడ్ జాబ్ అంటూ కొడుకును మెచ్చుకుంది. ఈ వీడియోను ది ఫీల్ గుడ్ పేజ్ లో పోస్ట్ చేశారు. వైకల్యంతో ఉన్న ఐదేళ్ల చిన్నారి తొలి అడుగులు వేస్తున్న క్ష‌ణాలు అంటూ వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ వీడియోకు 21000 వ్యూస్ రావ‌డంతోపాటు వేల సంఖ్య‌లో లైక్స్ వ‌చ్చాయి. ఈ వీడియో నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఇక అత‌నెప్పుడూ ఆగ‌డ‌ని ఆశిస్తున్నాను..అంటూ ఓ నెటిజ‌న్ కామెంట్ పెట్ట‌గా..అద్భుతంగా ఉందంటూ మ‌రో యూజ‌ర్ కామెంట్ పోస్ట్ చేశాడు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.