గురువారం 29 అక్టోబర్ 2020
International - Sep 30, 2020 , 18:09:18

ఐదేళ్ల తర్వాత కొడుకు మాట్లాడాడు.. తల్లిదండ్రుల సంబురం చూడండి..!

ఐదేళ్ల తర్వాత కొడుకు మాట్లాడాడు.. తల్లిదండ్రుల సంబురం చూడండి..!

హైదరాబాద్‌: అప్పుడప్పుడే మాట్లాడడం నేర్చుకున్న పిల్లలను చూసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. వారి ముద్దుముద్దు మాటలు విని సంబురపడతారు. కాగా, మీకా అనే బాలుడు ఆటిజం వల్ల మాట్లాడలేపోయాడు. అతడికి అశాబ్దిక ఆటిజం(నాన్‌వర్బల్‌ ఆటిజం) ఉందని వైద్యులు చెప్పారు. అంటే పదాలను పలికే సామర్థ్యం లేదన్నమాట. 

అయితే, తల్లిదండ్రులు అతడికి మెరుగైన చికిత్స అందించారు. దీంతో ఐదేళ్లు వచ్చేసరికి ఆ బాలుడు మాట్లాడడం నేర్చుకున్నాడు. తొలిసారి తన పేరును చెప్పగా, తల్లిదండ్రులు చూసి మురిసిపోయారు. అనంతరం కుటుంబంలోని ఒక్కొక్కరి పేర్లు చెప్పాడు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. అతడు మాట్లాడుతుంటే తల్లిదండ్రుల ముఖాల్లో కనిపించిన ఆనందం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo