శుక్రవారం 05 జూన్ 2020
International - May 13, 2020 , 19:58:33

ఈ వ్యాధులన్నీ చైనా నుంచే వస్తున్నాయ్‌

ఈ వ్యాధులన్నీ చైనా నుంచే వస్తున్నాయ్‌

వాషింగ్టన్‌: గత 20 ఏండ్లల్లో ఐదు రకాల వైరస్‌లు చైనా నుంచే వచ్చి ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయని, ప్రస్తుత కరోనా  కూడా చైనా నుంచే వచ్చిందని  అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఒబ్రయన్‌ ఆరోపించారు. వైట్‌హైస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచదేశాలు ఇదే విషయాన్ని ప్రస్తావించినా చైనా మాత్రం ఏమాత్రం బాధ్యత వహించడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వీటిని ప్రాథమిక దశలోనే గుర్తించి కట్టడి చేసే సామర్థ్యం చైనాకు ఉన్నా వారు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలా పట్టించుకోకపోవడం వల్లనే కరోనా విజృంభించి 2.50 లక్షల మందికి పైగా చనిపోవడానికి కారణమైందన్నారు. గత 20 ఏండ్లలో చైనా నుంచి సార్స్‌, ఎవియన్‌ఫ్లూ, స్వైన్‌ఫ్లూ, కొవిడ్‌-19లాంటి  భయంకర వైరస్‌లు చైనా  నుంచి పుట్టుకొచ్చాయని ఆరోపించారు.


logo