మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 22, 2020 , 16:42:56

కరాచీలో భారీ వర్షాలకు ఐదుగురు మృతి

కరాచీలో భారీ వర్షాలకు ఐదుగురు మృతి

కరాచీ : పాకిస్థాన్‌ రాజధాని కరాచీని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షానికి నగరం చిగురుటాకులా వణికిపోతోంది. వర్షాల కారణంగా శుక్రవారం వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మెమోన్ గోత్‌ ప్రాంతంలో పిడుగులు పడి ఇద్దరు యువకులు, విద్యుదాఘాతంలో మరో ఇద్దరు మృతి చెందగా లియారి నది ప్రవాహంలో కొట్టుకుపోయి వ్యక్తి మరణించారని రెస్క్యూ అధికారులు తెలిపారు. నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లి మురుగునీరు ఇండ్లలోకి చేరి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.

సుర్జని టౌన్, నార్త్ కరాచీ, ఒరంగి టౌన్ తదితర ప్రాంతాల్లో నడుము లోతు వరద నీరు చేరింది. సుర్జని పట్టణంలో 186 మి.మీ వర్షపాతం, ఉత్తర కరాచీ, నజీమాబాద్ ప్రాంతాల్లో 106 మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న సోమవారం నుంచి బుధవారం వరకు కరాచీతో సహా దిగువ సింధ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo