గురువారం 01 అక్టోబర్ 2020
International - Aug 14, 2020 , 15:36:53

కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి ఐదుగురు మృతి.. 38 మంది మిస్సింగ్‌

కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి ఐదుగురు మృతి.. 38 మంది మిస్సింగ్‌

ఖాట్మండు : కొండ చ‌రియ‌లు విరిగిప‌డి ఐదుగురు మృతిచెంద‌గా మ‌రో 38 మంది జాడ తెలియ‌కుండా పోయింది. ఈ దుర్ఘ‌ట‌న నేపాల్‌లోని సింధుపాల్‌చోక్ జిల్లాలో శుక్ర‌వారం ఉద‌యం చోటుచేసుకుంది. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై లామా టోల్ వార్డ్ చీఫ్ ప్ర‌తాప్ లామా స్పందిస్తూ... ఈ ఉద‌యం 6:30 గంటలకు కొండచరియలు విరిగిపడి ఇళ్ల‌న్ని నేల‌మ‌ట్ట‌మ‌య్యాయి. 12 ఇండ్ల‌కు పైగా తుడిచిపెట్టుకుపోయాయి. శిధిలాల నుండి ఐదు మృతదేహాలను వెలికితీశాం. ఎనిమిది మందికి తీవ్ర గాయప‌డ్డారు. సుమారు 38 మంది ఆచూకీ తెలియ‌కుండా పోయింద‌ని వెల్ల‌డించాడు.


logo